అన్ని రంగాల్లోనూ నిర్లక్ష్యం

– సమస్యల వలయంగా ఇల్లందు
– సీతారామ ప్రాజెక్టు సీఎం శంకుస్థాపన చేసిన శిలా ఫలకమే ఉంది
– అలుపెరగని పోరాటాల చరిత్ర సీపీఐ(ఎం)కు ఉంది
– రాజకీయ వారసత్వాన్ని కొనసాగిద్దాం
– సీపీఐ(ఎం) అభ్యర్థి దుగ్గి కృష్ణను గెెలిపించాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పోతినేని, కనకయ్య, శ్రీనివాస్‌, నున్నా
నవతెలంగాణ-ఇల్లందు
దశాబ్దాలుగా ఇల్లందు సమస్యల వలయంలో ఉందని అన్ని రంగాల్గొ నిర్లక్షం కొట్టోచ్చినట్లు కనపడుతోందని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు పోతినేని సుదర్శన్‌, ఖమ్మం కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరరావు, అన్నవరపు కనకయ్య, సాధుల శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక ఏలూరి భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వందల కోట్లతో నియోజవర్గాన్ని అభివృద్ధి చేశామని గత ఎంఎల్‌ఏలు, ప్రస్తుత అభ్యుర్థులు కోరం, హరిప్రియ అంటున్నారని తెలిపారు. రోడ్లు, డివైడర్లు, మొక్కలే అభివృద్ధిని అంటున్నారని ఇది సరికాదన్నారు. ముఖ్యమైన సమస్యలు ఎన్నో దశాబ్దాలుగా ఉన్నాయన్నారు. 2016లో రోళ్ళపాడు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గానికి నీరందించే ప్రాజెక్టు ఏడు సంవత్సరాలైనా అతిగతీ లేదన్నారు. శిలా ఫలకమే అలా మిగిలిపోయిందన్నారు. ఇటీవల సీిఎం కేసీఆర్‌ ఇల్లందు సభకు వచ్చిన సందర్భంగా స్థానిక ఎంఎల్‌ఏ హరిప్రియ మళ్ళీ సమస్య దృష్టికి తేవాల్సి వచ్చిందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం ఇవ్వకపోతే తామే నిర్మిస్తామని ప్రగల్బాలు పలికి కేంద్రం అడ్డుకుంటోందని సాకులు చెబుతున్నారని అన్నారు. గత ఎన్నికల సందర్భంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ ప్యాసింజర్‌ రైలు హామీ నెరవేర్చలేదన్నారు. బొగ్గుబావులు అంతరిస్తున్నా జనాభా తగ్గు తున్నా ఉపాధి పరిశ్రమల ఊసేలేదన్నారు. విభజన హామీలు తుంగలో తొక్కిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు. బీజిపిని రాష్ట్రంలో ఓడించడమే లక్ష్యమన్నారు.
ఉద్యమాలు చేసిన ఘతన సిపిఎందే
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలలో ఉద్యమాలు చేసి సమస్యలు సాధించిన ఘనత సీపీఐ(ఎం)దేనన్నారు. జిల్లాలో సమగ్ర నీటి పథకాలు, అనేక ప్రాజెక్టులు, ఎస్‌సీ, ఎస్‌టి సబ్‌ప్లాన్‌, బయ్యారం ఉక్కు పరిశ్రమ, పోడు భూములు, ఇండ్ల స్థలాలు, కాంట్రాక్టు, ఆశాలు, అంగన్‌వాడీలు ఇలా స్కీం వర్కర్ల వేతనాల సమస్యలపై పాద, సైకిల్‌ యాత్రలు, నిరహార దీక్షలు చేసిన అలుపెరగని పోరాటాలు చేసిన ఘతన తమదే అన్నారు.
సుత్తీ కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేయండి
కమ్యూనిస్టులను ఆదరించిన చరిత్ర ఇల్లందుకు ఉందన్నారు. 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితె 10సార్లు కమ్యూనిస్టులు విజయం సాధించారని అన్నారు. 1952 నుండి కమ్యూ నిస్టులను ఆదరించిన చరిత్ర ఉందన్నారు. రాజకీయ వారసత్వాన్ని కొనసాగిద్దామన్నారు. ఎందరో త్యాగధనులకు నిలయమన్నారు. ప్రజాస్వామ్యానికే వన్నెతెచ్చి సమస్యల సాధనకు కృషి చేసిన నియోజవర్గానికి చెందిన సీపీఐ(ఎం) నేత కేఎల్‌ నర్సిహారావు లాంటివారు మట్టిలో మాణిక్యమన్నారు. ప్రస్తుత కార్బోరేట్‌ రాజకీ యాలతో రాష్ట్రం డబ్బు, మధ్యంతో బ్రష్టుపట్టి పోయిందన్నారు. ఎంతో ఉద్యమ చరిత్ర, ప్రజా మన్ననలు పొందిన కామేపల్లి మండలానికి చెందిన దుగ్గి కృష్ణను గెలిపించాలన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని సుత్తీ కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని కోరారు. సమావేశంలో నియోజవర్గ మహబూ బాబాద్‌, కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు మండా రాజన్న, అబ్దుల్‌ నబి పాల్గొన్నారు.