ఎల్‌బీనగర్‌ ఎస్‌ఐపై బదిలీ వేటు

– గిరిజన మహిళపై పోలీసుల దాడి ఘటనలో..
నవతెలంగాణ-హాయత్‌ నగర్‌
హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐపై బదిలీ వేటు పడింది. మీర్‌పేటలో నివాసం ఉంటున్న ఓ గిరిజన మహిళను ఈనెల 15న అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్‌ లాకప్‌లో వేసి తీవ్రంగా కొట్టిన ఘటనకు సంబంధించిన హెడ్‌ కానిస్టేబుల్‌ శివ శంకర్‌, మహిళా కానిస్టేబుల్‌ సుమలతను ఇంతకు ముందే రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ దేవేందర్‌సింగ్‌ చౌహన్‌ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఎస్‌ఐ రవికుమార్‌ను పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు బదిలీ చేసినట్టు సీపీ వెల్లడించారు.