నేడు వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో

– గద్దర్‌ సంస్మరణ సభ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజాయుద్ధనౌక, ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్‌ సంస్మరణ సభ వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పది గంటలకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కళానిలయంలో జరగనుంది. ఈ మేరకు సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌ బాలమల్లేష్‌, డిజి నర్సింహారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సభకు ముఖ్యఅతిధులుగా సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, ప్రముఖ సినీ దర్శకులు బి నర్సింగ్‌రావు, ప్రముఖ కవి జయరాజ్‌, వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న హాజరవుతారని తెలిపారు. సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ఎస్‌యూసీఐ(సీ), ఫార్వర్డ్‌బ్లాక్‌, ఆరెస్పీ, సీపీఐ (ఎంఎల్‌), సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, సీపీఐ ఎంఎల్‌ (జనశక్తి) పార్టీల రాష్ట్ర నాయకులు, గద్దర్‌ కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, గద్దర్‌ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని కోరారు.