ఎంపీ బీబీ పాటిల్ ను  కలిసిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు

నవతెలంగాణ – మద్నూర్
ఉమ్మడి మద్నూర్ మండల సిర్పూర్ గ్రామ నివాసుడు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ శుక్రవారం మద్నూర్ మండల పర్యటనకు వచ్చిన సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీర్ శాఖ అధికారులు ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ బీబీ పాటిల్ ను కలిసిన వారిలో మద్నూర్ పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ, ఈ రవీందర్ బాబు బాన్సువాడ డివిజనల్ ఈ ఈ సమత మద్నూర్ మండల ఇన్చార్జి ఏఈ వీరి తోపాటు డోంగ్లి సింగిల్ విండో చైర్మన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్ తదితరులు ఉన్నారు.