3న ‘ఇప్పపూలు’ ఆవిష్కరణ

ప్రతిభా ప్రచురణలు (ఖమ్మం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో గిరిజన సంచార తెగల కథలు ‘ఇప్పపూలు’ ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాలులో ఆగస్టు 3న నిర్వహించే ఈ కార్యక్రమానికి డా.ఎన్‌. రఘు అధ్యక్షత వహిస్తారు. డా. గుమ్మడి అనురాధ పుస్తకావిష్కరణ చేస్తారు. నిఖిలేశ్వర్‌ ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా డా. మామిడి హరికృష్ణ హాజరవు తారు. డా. అమ్మంగి వేణుగోపాల్‌ గ్రంథ పరిచయం చేస్తారు.