– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామస్వామి
నవతెలంగాణ-చేవెళ్ల
4న చలో కొత్తగూడెంలో నిర్వహించే సీపీఐ ప్రజా గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రామస్వామి పిలుపు నిచ్చారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని భూ పోరాట కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, సింగరేణి, తదితర ప్రభుత్వ రంగ పరిశ్రమలు, రాజ్యాంగ లౌకిక వ్యవస్థల పరిరక్షణనకు భారత కమ్యూ నిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మహాసభకు సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ డి. రాజా హాజరవుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా 107 రోజులుగా భూ పోరాట కేంద్రంలో ఇండ్లు లేని నిరుపేదలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, కరెంటు లేకుండా లేకున్నా గుడిసెలు వేసుకున్న పోరాడు తున్న వారందరికీ సీపీఐ అండగా ఉంటుందన్నారు. ఈ సభకు కార్యకర్తలు, కార్మికులు, కర్ష కులు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు వేల సంఖ్యలో పాల్గొని విజయ వంతం కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీ యూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, పార్టీ మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి, మొయినాబాద్ మండల కార్యదర్శి కే.శ్రీనివాస్, గండిపేట్ మండల కార్యదర్శి బాబు రావు, బీవోసి మండల కార్యదర్శి శ్రీను, మహిళా సమాఖ్య నాయకురాలు సాయిలు, మాధవి, విజయమ్మ, అమృత తదితరులు పాల్గొన్నారు.