నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్)లో గురువారం ఓపెన్ డే నిర్వహించారు. సముద్రాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తలపెట్టిన ఈ కార్యక్రమంలో వివిధ విద్యాలయలకు చెందిన 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారు జాతీయ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్, ఆపరేషనల్ ఓషియన్ సర్వీసెస్ ల్యాబోరేటరీ, ది ఓషియన్ అబ్జర్వేషనల్ ల్యాబోరేటరీ తదితర వాటిని సందర్శించారు. ఈ సందర్భంగా సముద్ర పరిజ్ఞానంపై శాస్త్రవేత్తలతో జరిగిన చర్చల్లో విద్యార్థులు పాల్గొన్నారు. వారు తమ ప్రశ్నలడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ కాంపిటేషన్ తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.