వెంకటరమణ మోటార్స్‌ ఉమెన్స్‌ కార్‌ షోరూం ప్రారంభం

నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని టాటామోటార్స్‌ వారు తమ పాసింజర్‌ వెహికల్‌ విభాగంలో తమ అధీకత డీలర్‌ వెంకటరమణ మోటార్స్‌ ద్వారా ప్రెస్టేజియస్‌ మహిళా కార్‌ షోరూంని ఆదివారం డాక్టర్‌ బోడేపూడి శైలజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారని, ఆటోమొబైల్‌ రంగంలో కూడా ఇంకా ముందుకు రావాలన్నారు. వెంకటరమణ మోటార్స్‌ వారు ఖమ్మంలో ఎక్సక్లూసివ్‌గా ప్రత్యేకంగా మహిళలతో ఈ టాటా కార్స్‌ షోరూంని ప్రారంభించడం అభినందనీయమన్నారు. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఇంటికి దీపం ఇల్లాలు ఎలాగో ఉద్యోగంలో కూడా అలాగే ఉండాలని, ఆలోచనతో వెంకటరమణ మోటార్స్‌ ఇండియా లో మొట్ట మొదటి ప్రెస్టేజియస్‌ మహిళా కార్‌ షోరూంని హైదరాబాద్‌లో ప్రారంభించామని, ఇప్పుడు మన ఖమ్మంలో రెండవ మహిళా ఎక్సక్లూసివ్‌ కార్‌ షోరూం ని మా వెంకటరమణ మోటార్స్‌ లాంచ్‌ చేస్తున్నదని చెప్పారు. ఈ షోరూం మహిళా ఉద్యోగులతో నడపబడుతుందని, సెక్యూరిటీ నుండి డ్రైవర్‌ వరకు అందరూ మహిళా మనులే ఉంటారని టెస్టుడ్రైవ్స్‌ కూడా నిపుణులైన మహిళా డ్రైవర్స్‌తో నడపబడుతుందని చెప్పారు. ఈ టాటా కార్స్‌ మధ్యతరగతి కస్టమర్‌ నుండి విఐపి కస్టమర్స్‌కి అందుబాటులో ఉన్నాయని, వెంకటరమణ మోటార్స్‌ కస్టమర్‌ సర్వీస్‌ కోసం ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కోదాడ, సూర్యాపేటలలో క్వాలిఫైడ్‌ టేక్నిషన్‌లతో నడపబడుతున్నదని, ప్రతి సర్వీస్‌ పాయింట్‌లో కస్టమర్‌ క్విక్‌ సర్వీస్‌ ఉన్నాదని, కస్టమర్‌ సంతృప్తి కోసం కంప్లైన్ట్‌ ఫీడ్‌ బ్యాక్‌ రిజిస్టర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ ఎక్సక్లూసివ్‌ మహిళా షోరూం లో మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్‌, స్పెషల్‌ గిఫ్ట్‌ కూడా ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంస్థ చైర్మెన్‌ ద్రౌపతి మాట్లాడుతూ మహిళలు వాహనాలు ఎక్కువగా వాడుతున్నారని, వారి కోసం ఈ మహిళా షోరూం వెంకటరమణ మోటార్స్‌ ఎక్సక్లూజ్వ్‌ మహిళా షోరూం మన ఖమ్మంలో రావడం చాల ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ మహిళా ఉద్యోగులు, కస్టమర్స్‌ పాల్గొన్నారు.