మన తెలంగాణ…2 కోట్ల ఎకరాల మాగాణ

– ఎడేండ్లలో కోటి ఎకరాలకు పెరిగిన సాగు…
– రూ.లక్ష కోట్లకు వ్యవసాయ సంపద
– రైతుబంధు నుంచి రైతు బీమా దాకా పలు రైతు పథకాలు
– మద్దతు ధర నుంచి కొనుగోళ్ల దాకా వెన్నుదన్ను
– స్వరాష్ట్రంలో సగర్వంగా రైతాంగం
– పదేండ్ల పొద్దులో పచ్చని పరిమళాలు
– సమాచార, పౌరసంబంధాల శాఖ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ అభివద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కషి చేస్తున్నది. నాణ్యమైన ఉచిత విద్యుత్తును 24 గంటల పాటు వ్యవసాయానికి అందిస్తున్నది. ప్రభుత్వం కల్పించిన సాగునీటి వసతితో బీడు బారిన వ్యవసాయ భూమి సస్యశ్యామలంగా మారింది. వ్యవసాయ రంగపై ఆదారపడి బ్రతికే రైతుకు ఆర్థిక వెసులుబాటు కోసం పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. అనేక నూతన వ్యవసాయ పద్థతులు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి వ్యవసాయంలో అధిక దిగుబడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సమాచార, పౌరసంబంధాల శాఖ శుక్రవారం తెలిపింది. ఈమేరకు ఆ శాఖ కమిషనర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉద్యమ సమయంలో ఊరు, వాడ, పల్లె, పట్నంతోపాటు జిల్లాలో విస్తతంగా తిరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల సమస్యలు స్వయంగా చూశారు. రైతుల బాదలు ఆకళింపు చేసుకున్నారు.2014 జూన్‌లో ఏర్పడిన ప్రభుత్వ సారధిగా అభివద్ధి, సంక్షేమంపై ఉన్న అవగాహనతో సమగ్ర ప్రణాళికలను రూపొందించి దశల వారిగా ఒక్కొక్క సమస్యను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రైతులు, వ్యవసాయరంగం సమస్యలపై దష్టిసారించారు. దేశానికే వెన్నెముక అయిన రైతన్నకు అండగా నిలువాలని ముందుగానే వ్యూహన్ని రూపొందించారు.. వ్యవసాయాన్ని అభివద్ధి చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణ తీర్చిదిద్దాలని భావించారని ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరిచ్చింది. సాగు విస్తీర్ణాన్ని 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచింది. ఆధునిక సేద్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులను అందుబాటులో ఉంచడం వల్ల పంట ఉత్పత్తి, ఉత్పాదకతను అనేక రెట్లు పెంచింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నది.
ఇందులోను సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం 36,179 కోట్లను ఖర్చు చేసింది. దేశంలో వినూత్న ఒరవడితో రైతుబందు పథకం ప్రవేశపెట్టి రైతుకు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. రైతులకు సాలీన ఎకరానికి సంవత్సరానికి పదివేల రూపాయలను పంట పెట్టుబడి సాయంగా అందచేస్తున్నది. వీటితోపాటు రైతుబంధు, దేశంలో ఏ ప్రభుత్వమూ రైతులు చర్చించుకోవడానికి ఒక వేదిక అవసరమని రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ప్రభుత్వమే రైతు ముంగిటికీ వెళ్ళి మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తున్నది. నూతన వ్యవసాయ పద్ధతులతో పాటు రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని లాభదాయక రంగంగా మార్చింది. నాణ్యమైన ఉచిత విద్యుత్త్‌, సాగునీరు, సకాలంలో ఎరువులు అందించి వ్యవసాయ రంగం పురోగతికి నిరంతరం కృషి చేస్తున్నది.