– గొంది దివాకర్ మండల విద్యాధికారి
నవతెలంగాణ-గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా విధానాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో మన ఊరు మనబడి కార్యక్రమంతో కార్పొరేట్కు దీటుగా పోటీ పడుతున్నామని మండల విద్యాధికారి గొంది దివాకర్ అన్నారు. నవతెలంగాణ ఎడ్యుకేషన్ స్పెషల్ సందర్భంగా ఎంఈఓ గొంది దివాకర్ నవ తెలంగాణతో మాట్లాడారు. మండల వ్యాప్తంగా 48 పాఠశాలలు ఉండగా వీటిలో ఉన్నత పాఠశాలలు 9, వీటిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గౌట్ హైస్కూల్ కస్తూరిబా గాంధీ విద్యాలయం తెలంగాణ మోడల్ పాఠశాల ఆశ్రమ పాఠశాలలో ఉన్నాయి. ఎంపీపీ ఎస్ 24 , యుపిఎస్ 6, ఐటీడీఏ జిపిఎస్ 9 పాఠశాలలు నిర్వహణలో ఉన్నాయని అన్నారు. మొదటి విడత మన ఊరు మనబడి లో భాగంగా 8 ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ పాఠశాలలు నాలుగు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు నిధులు కేటాయించబడి పనులు పూర్తి దశలో ఉన్నాయని అన్నారు. మన ఊరు మన బడిలో భాగంగా పూర్తి విద్యా విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు అర్థం చేసుకొని లక్షల రూపాయల సొమ్మును ప్రైవేటు పాఠశాలలకు ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకుంటూ ఎంతో శిక్షణాతులైన ఉపాధ్యాయులచే విద్యను బోధిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. లక్షల రూపాయల విలువ చేసే డిజిటల్ బోర్డ్స్ , ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత నోటు పుస్తకాలు ఉచిత యూనిఫామ్ లు వీటన్నిటితో తల్లిదండ్రుల సొమ్ము వృధా కాకుండా విద్యార్థులకు మేలైన విద్య అందిస్తున్నామని అన్నారు. పిల్లల మానసిక వికాసానికి శారీర క ఆరోగ్యానికి కృషి చేస్తూ నిరంతరం సలహాలు సూచనలతో విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్నామని అపారమైన అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం ఉన్నారని అన్నారు. పిల్లలకు లోకజ్ఞానాన్ని నీతిని సామాజిక విలువలను ప్రపంచ విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా వేలాది పుస్తకాలతో కూడిన గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేలా ప్రయోగాలకు నిలవైన విలువైన ఆధునిక సైన్స్ ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. వారానికి మూడు పర్యాయములు కోడిగుడ్లు ప్రతిరోజు రుచికరమైన మధ్యాహ్నం భోజనానికి అవసరమైన హాలు సకల సౌకర్యాలతో విశాలమైన పాఠశాల ప్రాంగణం విద్యార్థులకు అందుబాటులో ఉందన్నారు. అన్ని ఆటలకు సంబంధించిన ఆట వస్తువులు క్రీడా సామాగ్రి సువిశాలమైన క్రీడా మైదానాలు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు బాసర ట్రిపుల్ ఐటి కి సులువైన ఎంపిక విధానం ఎనిమిదవ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించే ఎన్ ఎం ఎస్ పరీక్షల్లో నెగ్గితే సంవత్సరానికి 12, రూపాయల చొప్పున డిగ్రీ వరకు స్కాలర్షిప్ సౌకర్యం వీటికి తోడుగా పూర్వ విద్యార్థుల ఎనలేని సేవలు ఉన్నాయని మీకోసం మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషిచేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి పరిశీలించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి వినియోగిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకునే విధంగా సహకరించాలని అన్నారు.