వేతనాలు చెల్లించాలని ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆందోళన…

నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి పరిపాలన భవనం ముందు ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజులు గడుస్తున్నా ఇంతవరకు తమకు వేతనాలు ఇవ్వలేదని, వైస్ ఛాన్సలర్ నిర్లక్ష్యం వల్లనే తమకు వేతనాలు రావడం లేదనివారన్నారు. ఎస్బీఐ బ్యాంకు అధికారులకు వైస్ ఛాన్సలర్ కు ఫోన్ చేసి జీతాలు నిలుపుదల చేశారని సిబ్బంది ఆరోపించారు. గత రెండు నెలలుగా యూనివర్సిటీ లో వైస్ ఛాన్సలర్, పాలక మండలి సభ్యుల గొడవలతో తమకు ప్రతినెలా వేతనాల రాక ఇబ్బందులు ఎదురౌతున్నయని వారు పేర్కొన్నారు. వేంటనే వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా వైసాన్సలర్ యూనివర్సిటీకి రావడం మానేశారని,తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు.తమకు వేంటనే వేతనాలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని వారు హెచ్చరించారు.