సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం..

నవతెలంగాణ- రాజంపేట్
వీఆర్ఏల మండల అధ్యక్షుడు బోయిని రవికుమార్ మాట్లాడుతూ.. వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని, అదేవిధంగా పే స్కేల్ ను పెంచడంతో చాలా సంతోషంగా ఉన్నామని సీఎం కేసీఆర్ కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పందుల నరసింహులు, కోశాధికారి బాల్ లింగం, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, రమేష్, బాబు సభ్యులు ధర్మపురి, శ్రీకాంత్, కిష్టయ్య, రవి, భాస్కర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.