– అదనపు కలెక్టర్ మధుసూదన్
నవతెలంగాణ- ఖమ్మం
ఎన్నికల సంఘం మార్గదర్శకాలక నుగుణంగా ప్రశాంత వాతావరణంలో శాసనసభ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరిం చాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ప్రచార సభల నిర్వహణ సమావేశాల అనుమతులు, నిబంధనలు ఇతర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ప్రతి అంశం ఎన్నికల నిబంధనలకు లోబడి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ఫిర్యాదులు, అనుమతులు, నామినేషన్ ప్రక్రియలను సులభతరం చేసేలా సీ-విజిల్, ఈ-సువిధ యాప్ లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఈ- సువిద యాప్ ద్వారా పార్టీ సమావేశాలకు సంబంధించి ముందస్తు అనుమతులను పొందవచ్చని తెలిపారు. పొలిటికల్ పార్టీలకు చెందిన వారు వారి బూత్ స్థాయి ఎజెంట్ల వివరాలను సమర్పించాలని కోరారు. ప్రచారాలను ఎప్పటికప్పుడు ఆయా కమిటిల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని, నిబంధనలకు అనుగుణంగా రాజకీయపార్టీలు తమ కార్యక్రమాలను నిర్వహించు కోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, మాస్టర్ ట్రైనర్ కె.శ్రీరామ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, జిల్లా సహకార శాఖ అధికారి విజయకుమారి, బిఅర్‌ఎస్ పార్టీ ప్రతినిధి కె.ఉమాశంకర్, బిజెపి పార్టీ ప్రతినిధి గేంటెల విద్యాసాగర్, సిపిఐ ప్రతినిధి పి.వెంకటరమణ రావు, ఐఎన్‌సి పార్టి ప్రతినిధి వై.బలగంగాధర్ తిలక్, టిడిపి పార్టీ ప్రతినిధి కె.కరుణాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ఎన్.తిరుమలరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మదన్‌గోపాల్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.