పార్టీలు తమ మేనిఫెస్టోలో దివ్యాంగుల సమస్యలపై తగిన న్యాయం చేస్తామని హామీ నివ్వాలి..

నవతెలంగాణ- డిచ్ పల్లి:
ప్రస్తుతం రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలో దివ్యాంగుల సమస్యలపై తగిన న్యాయం చేస్తామని ఏ పార్టీ హామీ ఇస్తుందో  వారికి దివ్యాంగులు మద్దతు చేయాలని ఏకగ్రీవంగా
 తీర్మానించారు. మంగళవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని మండల దివ్యాంగుల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అది పనికిమాలిన శాఖ అని చెప్పి కెసిఆర్ ఆ  శాఖను శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయటం  దురదృష్ట కారమన్నారు. దివ్యాంగులకు ఒక పెన్షన్ తప్ప మిగతా ఏ స్కీంలో దివ్యంగులకు అన్యాయం జరుగుతోందని వివరించారు. దివ్యంగులకు సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం ఒక కారణం ఉంటే, ఒక వేదిక అంటు లేదని పేర్కొన్నారు. ఇదే కాకుండా ఇప్పటికి ఒక రాయితీ రుణాలు అందిన దాఖలాలు లేవన్నారు. కుటుంబన్ని పోషించుకుందమంటే  ఉపాధి అవకాశాలు లేవని, దళిత బంధు లాగా వికలాంగుల బంధు ఇవ్వాలని, సంక్షేమ శాఖను తిరిగి ఏర్పాటు చేసి దానికి తగిన బడ్జెట్ ను కేటాయించి వికలాంగులకు అన్ని విధాలుగా సహాయం చేస్తా మనీ చేప్పే  పార్టీకి దివ్యాంగులు తరఫున పూర్తి మద్దతు ఉంటుందనే విషయమై ప్రతినిధులందరు కలిసి తీర్మానించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాల్లో, ఉద్యోగాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ సమాజంలో నిజమైన పేదవారు ఆవయవాలు లేని వారెనని అదేవిధంగా దివ్యాంగుల్లో కూడా వారి యొక్క వైకల్య శాతాన్ని బట్టి వివిధ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తివ్ర వైకల్యం ఉన్నవారికి ద్విచక్ర వాహనాలు  ఇవ్వాలని, వైకల్యం కలిగి ఉన్న వారిని వివాహం చేసుకుంటే వారికి కళ్యాణ లక్ష్మి మాదిరిగా దివ్యాంగులకు వివాహ వాడితే 5 లక్షల రూపాయల పరిహారం కూడా ఇవ్వాలని,  పలు సంక్షేమ పథకాలు దివ్యాంగులకు అండగా ఉండే విధంగా అన్ని విధాల సౌకార్యాలు కల్పిస్తామని హామీ ఇస్తూ వారి మేనీ ఫేస్టులో పెట్టిన మద్దతు ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు  కుంట మహిపాల్, అంకం గంగాధర్, నవీన్ కుమార్, నల్లవెల్లి మహిపాల్ మహిళా ప్రతినిధులు అబ్బావ్వ, కుంట జమున, కుమ్మరి జమున, లలిత, సత్యవ్వ, మండలంలోని దివ్యాంగులు పాల్గొన్నారు.