నవతెలంగాణ-తలకొండపల్లి
క్రీడలతో మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని సర్పంచ్ సంగీత శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో 2023-2024 7వ సీనియర్ రాష్ట్రస్థాయి టెన్నీ కాయిట్ ఛాంపియన్ షిప్ క్రీడా పొటీలు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ వారి సౌజన్యంతో నిర్వహించారు. టెన్నీ కాయిట్ ఛాంపియన్ షిప్ క్రీడా పొటీలు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ సంగీతశ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యా రు. టెన్నికాయిట్ క్రీడల్లో గెలిచిన నిజామాబాద్, రంగా రెడ్డి క్రీడాకారులను సన్మానించి, మెమోంట్స్ అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర, జా తీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకా రులకు తన సహకారం ఎల్లాప్పుడూ ఉంటుందని తెలి పారు. ఈ కార్యక్రమంలో జాతీయ టెన్నికాయిట్ ప్రధాన కార్యదర్శి యాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కేవీ శ్యామ్ సుధర్, జిల్లా ఛైర్మెన్ చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా కో-ఆప్షన్ స భ్యుడు మూజీబూర్ రహేమాన్, మాజీ ఎంపీటీసీ శ్రీని వాస మూర్తి, ఉప్ప సర్పంచ్ అజిజ్, ఎంపీటీసీ అంబాజీ, అసోసియేషన్ సభ్యులు మహేందర్, చైతన్య, రవీందర్, వానరసి వెంకటేష్, వెంకట్‌రెడ్డి, సత్యంగౌడ్, సుల్తాన్, శ్రీశైలం, సాయి, కిరణ్, వివిధ జిల్లాల క్రీడాకారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.