ఎమ్మెల్యే సీతక్క ప్లెక్సీపై స్టీక్కర్ అంటించండి..

– జీ సీసీ అధికారులపై ఏ ఎంసీ చైర్మన్  ఫైర్
– వాజేడు మంత్రి పర్యటనలో  ఫ్లేక్సీల రగడ
నవతెలంగాణ-వెంకటాపురం : ములుగు జిల్లా వాజేడు మండలంలో మంత్రి సత్యవతి రాథోడ్ పూసురు సమీపంలో జీసీసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీ సీసీ అధికారులు ఏర్పాటు చేసిన ప్లెక్సీపై బీఆర్ఎస్ నాయకులు నూగురు మార్కెట్ కమిటీ చైర్మెన్ బోదెబోయిన బుచ్చయ్య అసహనం వ్యక్తం చేశారు. భద్రాచలం నియోజక వర్గంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రోటో కాల్ పట్టించుకోరా అని మండి పడ్డారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, భద్రాచలం ఎమ్మెల్యే పొందేం వీరయ్య ప్రోటోకాల్ విస్మరించి ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్లెక్సీ ఏర్పాటు చేస్తారా..? సీతక్క ప్లెక్సీపై స్టీక్కర్ అంటించండి అంటూ మండి పడ్డారు. చైర్మెన్ ఆగ్రహంతో జీసీసీ సిబ్బంది సీతక్క ప్లెక్సీని తొలగించారు. పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ శిలాఫలకంపై సైతం స్థానిక కోఆప్షన్ సభ్యులను విస్మరించి ములుగు ఎమ్మెల్యే పెరు ఎలా పెడతారు అంటూ స్థానిక ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు ను భద్రాచలం  ఎమ్మెల్సీగా పెరు ప్రచురించడం తో నాయకులు ప్రాతినిద్యం వహిస్తున్న ప్రాంతం కూడా జీ సీసీ అధికారులకు తెలియక పోవడం విడ్డురం గా ఉంది అంటూ జీసీసీ అధికారుల తీరుపై స్థానిక ప్రజాప్రతినిధులల్లో అసంతృప్తి నెలకొంది. ఏదిఏమైన జీ సీసీ అధికారుల ప్లెక్సీ రగడ ఏజన్సీలో హాట్ టాపింగ్ గా మారింది.