పశుమిత్రలకు కనీస వేతనం ఇవ్వాలి

– 18న డీఆర్‌డీఏ ఆఫీసుల ఎదుట ధర్నాలు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని పశుమిత్రలకు కనీస వేతనమి వ్వాలని పశుమిత్ర వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసు మాధవి డిమాండ్‌ చేశారు. ఈ నెల పశుమిత్రల డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 18న డీఆర్‌డీఏ ఆఫీసుల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామనీ, 20న కలెక్టర్లకు వినతిపత్రాలి స్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఆ యూనియన్‌ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. పశుసంవర్ధక శాఖ-పశు పోషకులకు మధ్య పశుమిత్రలు వారధిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వారికి కనీసం గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. వారికి యూనిఫామ్‌లు, గుర్తింపుకార్డులు, గ్లౌజులు, మాస్కులు, మెడికల్‌ కిట్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పశుమిత్రలందరికీ ఏఐ ట్రైనింగ్‌ ఇవ్వాలని కోరారు. కొత్త రజిని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శ్రీరాం పద్మ, ఎమ్‌డీ నాజియా, సమ్రీన్‌, చైతన్య, ఇరుసుల్ల శ్రీలత, మనీషా, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.