– తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్న తనయ
నవతెలంగాణ-భద్రాచలంరూరల్
భద్రాచలం ఏజెన్సీ పరిసర ప్రాంతాలలో అరకొర వసతులు ఉన్న 1997 సంవత్సరంలోనే ఉమ్మడి ఖమ్మం విద్యార్థులకు అత్యాధునికమైన ఇంజనీరింగ్ విద్య అందించాలనె లక్ష్యంతో భద్రాచలం మండలంలోని ఎట్టపాక మేడ్ వై ప్రాంతంలో పౌల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారు. డాక్టర్ రేవా సతీష్ పాల్ రాజ్ వెనకబడిన ప్రాంతాలలో అత్యాధునిక సాంకేతిక విద్యను అందించాలనె లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పారు. జీవిత ప్రారంభం నుండి ఏజెన్సీ ప్రాంతంలో అనేక రకాల విద్యాసంస్థలు నెలకొల్పి పేద బలహీన వర్గ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు వివిధ మిషన్స్ ద్వారా నిర్వహిస్తూ విద్యతో పాటు అనేక రకాల సేవా కార్యక్రమాలను రేవా సతీష్ పాల్ రాజ్ హయంలో నిర్వహించారు. భద్రాచలం బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల అతి తక్కువ సమీపంతో పాటు కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కి 43 కిలోమీటర్ల దూరంతోపాటు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి కేవలం 210 కిలోమీటర్ల దూరంలోనే ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. కళాశాల స్థాపించిన నాటి నుండి దేశ విదేశాలలో అత్యధిక ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తనకున్న ఇతర దేశాల ప్రతినిధుల సంబంధాలను సైతం విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి ఎదిగేలాగా రేవ సతీష్ పాల్ రాజ్ కృషి చేశారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం ఎట్టపాక మండలం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో ఇం జనీరింగ్ కాలేజ్ ఆంధ్ర ప్రదేశ్‌కి బదిలీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకు విద్యను అందించడంలో ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా జేఎన్టీయూకే కాకినాడకి అనుబంధంగా కళాశాలను నడిపిస్తూ విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నారు. 2019 కరోనా అనంతరం విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి పరిణామాల నేపథ్యంలో పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆశయాన్ని పక్కదారి పట్టకుండా ఉండేందుకు రేవ సతీష్ పాల్ రాజ్ తనయురాలు వరలక్ష్మి చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. వరలక్ష్మి తో పాటు కాలేజీ సెక్రటరీ జకరయ్య బాలరాజు వారసుడైన రాజశేఖర్ బాధ్యతలు తీసుకొని కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నారు. అత్యధిక లేబరేటరీతో పాటు కంప్యూటర్ లాబరేటరీ, ప్లేగ్రౌండ్ వంటి ఇతర వసతులను కల్పిస్తూ అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులను ఎంపిక చేసి విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అన్ని రకాల అవకాశాలను వరలక్ష్మి నేతృత్వంలో ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుంది. ఏజెన్సీకి ఎన్నో రకాల సేవలు అందించి తన జీవితాన్ని మన్యం ప్రజలకు అంకితం ఇచ్చిన రేవ సతీష్ పౌల్ రాజ్ విగ్రహాన్ని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం వేడుకలను కళాశాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కళాశాల ఆధ్వర్యంలో భద్రాచలంలో నిర్వహించు అనేక రకాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక క్రీడా రంగా కార్యక్రమాలకు పౌల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజీ నుండి చేయూతనందిస్తూ విద్యాసంస్థల నిర్వహణ అంటే వ్యాపార కేంద్రాలు కాదు సామాజిక బాధ్యతని నిరూపిస్తున్న పాల్‌రాజ్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి నవతెలంగాణ పత్రిక నుండి ప్రత్యేక అభినందనలు తోపాటు రేవ సతీష్ పాల్ రాజ్ 80వ జన్మదిన వేడుకలలో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తుంది.