నవతెలంగాణ -గాంధారి
గాంధారి మండల కేంద్రంలో కొన్ని ప్రైవేటు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న పాలశాలపై చర్యలు తీసుకోవాలని పిడి ఎస్ యూ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి కి ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణ చర్యగా మండల అధికారులు పాఠ్యపుస్తకాలతో నిండిన గదిని సీజ్ చేయడం జరిగింది, ఇకపై ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతే కఠిన చర్యలు తీసుకోవాలని స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని PDSU జిల్లా అధ్యక్షుడు సతీశ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కనీస సదుపాయాలు లేకుండా నడుస్తున్నటు వంటి ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పరిమితికి మీంచి స్కూల్ బస్సులలో విద్యార్థులను తరలిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా డిమాండ్ చేశారు. ఆలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కనిస మౌళిక సదు పాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాద్యాయ పోస్టులను భర్తీ చేయాలని, మాన ఊరు మన బడి పథకంలో అన్ని పాఠశాలలకు వర్తింపజేయాలని నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని మరియు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఇష్ట రాజ్యాంగ వసూలు చేస్తున్న ఫిజులు నియంత్రిచి ఫిజు నియంత్రణ చట్టం చేయాలని వామపక్ష విప్లవ విద్యార్ధి సంఘాల అద్వర్యంలో రేపు తలపెట్టే విద్యా సంస్థల బందును విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలోపివైల్ జిల్లాఉపాధ్యక్షుడు ప్రేమ్ సింగ్, పిడిఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు మోజిరాం, నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు