‘ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత’

నవతెలంగాణ-దోమ
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొంటే మానసిక ప్రశాంతత పొందవచ్చునని బీజేపీ నాయకులు చేవెళ్ల మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్‌ రెడ్డి, పరిగి బీజేపీ నా యకులు (కేఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌) శరత్‌కుమార్‌ రెడ్డి అన్నా రు. మండల పరిధిలోని దొంగఎన్కెపల్లి గ్రామంలో బొడ్రా యి, శాంతి హౌమం, మైసమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన ఆదివారం పూజా కార్యక్రమాలకు హాజరై ప్రత్యేక పూజలను బీజేపీ నాయకులు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రె డ్డి, కేఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ శరత్‌కుమార్‌ రెడ్డి నిర్వ హించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్‌ పటే ల్‌, కిసాన్‌ మోర్చా జిల్లా మాజీ ఉపాధ్యక్షులు శేరి కిష్టారెడ్డి, మండలాధ్యక్షులు శేరిరాంరెడ్డి, సర్పంచ్‌ అశోక్‌ రెడ్డి, మాజీ సర్పంచులు క్రిష్ణయ్య, వెంకట్‌ రెడ్డి, బీజేపీ గ్రామాధ్యక్షులు సత్యనారాయణ, ఆంజనేయులు, చెన్నయ్య, మైపాల్‌రెడ్డి, నాగేంద్ర, గోపాల్‌, వడ్డేఅనిల్‌, బన్నీ, రాములు, భీమయ్య, తిరుపతయ్య, చంద్రయ్య, మణికంఠసాగర్‌, అడ్వకెట్‌ ప్రతా ప్‌గౌడ్‌, ఐనాపూర్‌ మేకల నర్సింలు, దోమ శ్రీనివాస్‌, శివ, యాదగిరి గ్రామస్తులు పాల్గొన్నారు.