మణిపూర్ అమానవీయ చర్యలను నిరసిస్తూ శాంతి ర్యాలీ

నవతెలంగాణ-గోవిందరావుపేట
మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసీలపై జరుగుతున్న అమానవీయ చర్యలను నిరసిస్తూ శుక్రవారం మండల పాస్టర్ సంఘం మండల ప్రెసిడెంట్ అబ్రహం మరియు సిస్టర్ క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సిపిఎం పార్టీ, ప్రజాసంఘాలు,మహిళా (ఐద్వా) సంఘం, డివైఎఫ్ఐ  నాయకుల సంఘీభావం తెలియజేయడం జరిగింది. పెద్ద సంఖ్యతో సెయింట్ మేరీస్ స్కూలు ముందు నుంచి పసర చౌరస్తా వరకు పెద్ద ర్యాలీగా బయలుదేరి చౌరస్తాలో మత సామరస్యానికి మానవత్వ విలువలకి నిదర్శనంగా మానవహారం ప్రదర్శించారు తర్వాత మండల కేంద్రం గోవిందరావుపేటకు వెళ్లి అక్కడ కూడా చౌరస్తాలో మానవహరం ప్రదర్శించి ర్యాలీగాబయల్దేరి నినాదాలు చేస్తూ తాహసిల్దార్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మణిపూర్ గిరిజన మహిళలను రక్షించాలనీ, ఘటనా కారకులను వెంటనేకఠినంగాశిక్షించాలనిరాజ్యాంగాన్నిపరిరక్షించాలనే విషయాన్సారంగా తాహసిల్దార్ అల్లం రాజకుమార్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈసంఘీభావకార్యక్రమంలోసిపిఎంపార్టీ పొదిళ్ల చిట్టిబాబు, సిపిఎం పార్టీమండల కార్యదర్శి తీగల ఆగి రెడ్డి,అంబాలమురళి ముమ్మడి ఉపేంద్రా‌చారి పల్లపు రాజు, కారం రజిత ,జిమ్మజ్యోతి ,మంచాల కవిత అరుణ్, సిరిపల్లె జీవన్ తదితరులు పాల్గొన్నారు.