తెలంగాణ ఏజీను సత్కరించిన పెద్దవూర కాంగ్రెస్ నేతలు

నవతెలంగాణ -పెద్దవూర: నల్గొండ జిల్లా నగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పినవూర గ్రామానికి చెందిన తేరా రజినీకాంత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ (ఏజీ )(Additional Advocate General)గా ప్రభుత్వం నియమించింది. రజినీకాంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పలు కేసులు వాదించిన ఆయనను అదనపు అడ్వకెట్ జనరల్ గా నియమమించడం పట్ల పెద్దవూర కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.  తేరా రజినీకాంత్ రెడ్డి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మల్లురవి వ్యక్తిగత కేసులను సహితం వాదించారు. అదనపు అడ్వకేట్ జనరల్ గా ప్రభుత్వం నియమించిడం పట్ల సాగర్ నియోజకవర్గం ప్రజలు, ముఖ్యంగా పెదవూర, పినవూర గ్రామస్తులు హర్షము వ్యక్తం చేసిన విషయం తెలిసిందే శనివారం మండల కేంద్రం లోని కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ లోని రజినీకాంత్ కార్యాలయం లో ఘన సన్మానం చేశారు. సన్మానం చేసిన వారిలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పబ్బు యాదగిరి గౌడ్, మిట్టపల్లి కిరణ్ కుమార్, నడ్డి ఆంజనేయులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఊరే వెంకన్న, కత్తి విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.