తాండూరు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తాటికొండ స్వప్న పరిమల్‌
నవతెలంగాణ-తాండూరు
మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో రైతులు, కార్మికులు, ప్రజలు, అప్రమత్తం గా ఉండాలని తాండూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తాటికొండ స్వప్న పరిమల్‌ తెలిపారు. ఎలక్ట్రా నిక్స్‌ స్తంభాలను దూరంగా ఉండాలని, వాగులు, నదులు, బ్రిడ్జిల నుంచి దాటే క్రమంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం గా ఉండాలని ఆమె సూచించారు. మున్సి పల్‌ అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహాయక చర్యలు తీసుకో వాలనీ ఆదేశించారు. తాండూర్‌ మున్సిపల్‌ ఆఫీస్‌లో కంట్రోల్‌ రూం ను ఏర్పాటు చేశారు. సహాయక చర్య ల కోసం 08411-272021 నంబ ర్‌కు సంప్రదించాలన్నారు.