భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– మున్సిపల్‌ కమిషనర్‌ వెంకన్న
నవతెలంగాణ-షాద్‌ నగర్‌
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసి స్తున్న వారు జాగ్రత్తలు వహించాలని షాద్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వెంకన్న సూచిం చారు. గురువారం పట్టణంలో పలు లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వానలో తడుస్తూనే సిబ్బం దికి సూచనలు జారీ చేశారు. అదేవిధంగా డ్రయినేజీ వ్యవస్థ ఎక్కడ పొంగుతుందో తెలుసుకుని, స్థానిక సిబ్బంది, జవాన్లతో మాట్లాడి వారికి సూచనలు సలహాలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాలు, శిథిలా వస్థలో ఉన్న ఇండ్లను పరిశీలించారు. జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత జవాన్లు వార్డు అధికారిని ఆదేశించారు. వానలకు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే మున్సిపల్‌ కార్యాలయానికి సమాచారం అందజేయాలని సూచించారు.