– టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు పామైన భీంభరత్
నవతెలంగాణ-షాబాద్
గ్రామీణ ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు పామైన భీంభరత్ అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని మన్మర్రి గ్రామంలో చిల్కూర్ బాలాజీ కాలేజీ ఆఫ్ ఫార్మసీ వారి సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపీణీ చేశారు. గ్రామానికి చెందిన 300 మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు పామైన భీంభరత్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కార్పొరేట్ ఆస్పత్రులల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు రావాలన్నారు. దాతలు ముందుకు వచ్చి వైద్య సేవలు చేయాలన్నారు. టీపీసీసీ కార్యదర్శి పీసరి సురేంద ర్‌రెడ్డి మాట్లాడుతూ… పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి అవకాశాలు గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పామైన భార్గవరాం, చేవెళ్ల డివిజన్ యూత్ అధ్యక్షుడు పెంటారెడ్డి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, నాయకులు యాదయ్య, మల్లి మహేష్, వెంకట్‌రెడ్డి, నర్సింహులు, చెన్నయ్య, రంగయ్య, వెంకటయ్య, వైద్యులు డాక్టర్ సాయిపవన్, మహేశ్వరీ, రజితశ్రీ తదితరులు పాల్గొన్నారు.