ఓబీసీ పార్లమెంటరీ కమిటీకి సెంట్రల్‌ వర్సిటీ బీసీ అసోసియేషన్ల వినతి

నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
జోతిబాఫూలే పేరుతో బీసీ సమ స్యలపై దేశవ్యాప్తంగా, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌స ీయూ)లో పరిశోధనా కేంద్రాలనే ప్రారంభించాలని బీసీ అసోసియేషన్లు డిమాండ్‌ చేశాయి. మంగళవారం ఓబీసీ పార్లమెంటరీ కమిటీలోని 30 మంది సభ్యులతో హెచ్‌సీయూలో బీసీ అసోసియేషన్ల ప్రతినిధులు సమా వేశమయ్యారు. 30 బీసీ సమస్యలు, వివిధ అంశాల మీద చర్చించారు. పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌ రాజేష్‌ వర్మ, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ను కలిసిన వారిలో హెచ్‌సీయూ ఓబీసీ ఎంప్లాయి స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ఈ వెంకటేశ్‌, అధ్యక్షుడు గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దుర్గేష్‌ సింగ్‌, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ కిరణ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి అరుణ్‌ కేతన్‌, జాతీయ కార్యదర్శి సాయికిరణ్‌ తదితరులున్నారు. రోస్టర్‌ ను తప్పకుండా పాటించాలనీ, ప్రొఫె సర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అస ిస్టెంట్‌ ప్రొఫెసర్‌ క్యాడర్లలో 27 శాతం రిజర్వేషన్లను పాటించాలని కోరారు. బీసీ విద్యార్థులకు రీసెర్చ్‌ ఫెలోషిప్‌ల ను రూ.ఐదు వేలకు పెంచాలనీ, ప్రధాన మంత్రి రీసెర్చ్‌ ఫెలోషిప్‌లో రిజర్వేషన్లను పాటించాలనీ, ఎంప్లారు క్వార్టర్స్‌ లొకేషన్‌లో రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. వర్సిటీ ల ఉపకులపతుల నియామకంలో జాతీయస్థాయి కమిటీల్లో బీసీలను జనాభా ప్రాతిపదికన నియమించా లనీ, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్సెస్‌ రీసెర్చ్‌ వారు పరిశోధన కోసం ఇచ్చే ఆర్థిక నిధుల్లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.త్సరాల నాటివి. సీబీఐలో వివిధ ర్యాంకులలో 1,695 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీవీసీ తెలిపింది. సీబీఐ విచారణ జరుపుతున్న 6,841 అవినీతి కేసులలో 313 కేసుల విచారణ 20 సంవత్సరాలకు పైగానే సాగుతోంది. విచారణను సంవత్సర కాలంలో ముగించాల్సి ఉన్నప్పటికీ వందలాది కేసులలో అది సాధ్యపడడం లేదు.