గర్శకుర్తిని మండలంగా గుర్తించాని కవినోద్ కుమార్ కు వినతి

నవతెలంగాణ – గంగాధర: గర్శకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ మండల సాధన సమితి నాయకులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా గర్శకుర్తితో పాటు అనేక గ్రామాల ప్రజలు కోరుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు ప్రభుత్వం గర్శకుర్తి మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రం ఏర్పాటు వల్ల ప్రజలకు సౌలభ్యంతో పాటు మండలం ఆయా గ్రామాలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. గర్శకుడు మాజీ సర్పంచ్ కల్వకోట సవితాదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, మండల సాధన మండల సాధన సమితి నాయకులు పొత్తూరు సురేష్ తో పాటు కాసారం, దర్శకుర్తి వద్దారం తోపాటు అనేక గ్రామాల ప్రజలు వినతి పత్రం అందించిన వారిలో ఉన్నారు.