పాలిచ్చే తల్లులు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం ఎంత ముఖ్యమో, కొన్ని తినడం కూడా అంతే ముఖ్యం. అందులో చెప్పుకోవలసినది పైనాపిల్. ఇందులో చాలా ముఖ్యమైన పోషకాలు, డైటరీ ఫైబర్ బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి, ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. ఈ పోషకాలలో చాలా వరకు తల్లి పాలలోకి వెళ్లి బిడ్డకు మేలు చేస్తాయి. ఇది హైడ్రేటింగ్ ఫ్రూట్ కూడా. పైనాపిల్ ఆమ్లంగా ఉంటుంది. సిట్రస్ కలిగి ఉండే ఆమ్ల పండ్లు శిశువు ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడతాయో చూద్దాం…
పోషకాలు
పైనాపిల్‌లో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి పాలిచ్చే తల్లులకు మేలు చేస్తాయి. తల్లి పాల ద్వారా చిన్న మొత్తంలో కొన్ని విటమిన్లు, పోషకాలు బిడ్డకు అందుతాయి. కాబట్టి పోషకాల పరంగా పైనాపిల్ బెస్ట్.
డైటరీ ఫైబర్
పాలిచ్చే తల్లికి రోజుకు 34 గ్రాముల ఫైబర్ అవసరం. పైనాపిల్ ఫైబర్-రిచ్ ఫుడ్. చాలా మంది తల్లులు డెలివరీ తర్వాత మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడతారు. కాబట్టి, పైనాపిల్ వారికి మంచి ఉపశమనం.
హైడ్రేషన్…
165 గ్రాముల పైనాపిల్ సుమారు 142 గ్రాముల నీటిని అందిస్తుంది. పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి నీరు అవసరం కాబట్టి, ఆహారంలో పైనాపిల్‌ను చేర్చుకోవడం మంచిది. నీటితో పాటు, పైనాపిల్ ప్రసవానంతర సమస్యలను పరిష్కరిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలకు కూడా సహాయపడుతుంది. కానీ పైనాపిల్‌తో సహా ఏదైనా ఆహారం తిన్న తర్వాత పాలిచ్చే తల్లులు బిడ్డపై అవి ఏ విధంగా ప్రభావం చూపుతాయో గమనించుకుంటూ ఉండాలి. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే అటువంటి ఆహారానికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండటం ఉత్తమం.