కార్మిక-శ్రామిక రంగాల పధగామి

– సీపీఐ(ఎం) పేట అభ్యర్థిగా పిట్టల అర్జున్‌
నవతెలంగాణ-అశ్వారావుపేట
విద్యార్థి దశలోనే వామపక్ష భావజాలంతో విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘం నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం కార్మిక – శ్రామిక రంగాల పధగామిగా పనిచేస్తున్న సీఐటియు జిల్లా నాయకుడు పిట్టల అర్జున్‌ను సీపీఐ(ఎం) అశ్వారావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కమిటీ ఎంపిక చేసింది. రాజకీయ ప్రస్థానం భారత కమ్యూనిస్ట్‌ పార్టీ(మార్క్సిస్ట్‌ ) అనుబంధం విద్యార్ధి సంఘం ఎస్‌.ఎఫ్‌.ఐ ద్వారా 1994 లో ప్రారంభం అయింది.విద్యార్ధులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం తో పాటు విద్యారంగంలో అనేక సంస్కరణల కోసం పలు ఆందోళనలు,నిరసనలు చేపట్టారు. 2021 నుండి 2011 వరకు దమ్మపేట మండల కార్యదర్శిగా పని చేసారు.పోడు భూములు సాధనకోసం కేసులు నమోదు అయ్యాయి. 2011 నుండి నేటి వరకు సిఐటియు జిల్లా కమిటీ,పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా అంగన్వాడి,ఆశా,మధ్యాహ్నం భోజన కార్మికులు,నిర్మాణ రంగ కార్మికులు,హమాలీ ల సమస్యలు పై నిరంతరం కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉద్యమ నేపథ్యం : ఇంటర్మీడియట్‌ చదువుతూనే ఉద్యమంలోకి వచ్చారు. విద్యా రంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసారు. 2011 నుండి కార్మిక, శ్రామిక, అసంఘటిత రంగాల వేతన జీవుల సమస్యలు పరిష్కారం నిరంతరం పనిలో ఉండటం విశేషం.