ఇంట్లో మొక్కలు పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. అవి ఇంటికి సహజ సౌందర్యాన్ని తీసుకువస్తాయి. ఇంట్లో మొక్కలు పెంచు కోవడం ఆకర్షణ మాత్రమేకాదు, కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇండోర్ ప్లాంట్స్ వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
మానసిక ఆరోగ్యం : ఇండోర్ మొక్కల పెంచుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించు కోవచ్చు. ప్రశాంతతను ఫీల్ అవుతారు. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట.
ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం : మొక్కల్లో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ తక్కువ స్థాయిలో ఉంటుంది. అందువల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఈ మధ్య చాలా ఆస్పత్రులు తమ డిజైన్‌లలో మార్పులు చేసి మరీ మొక్కల పెంపకంపై దృష్టి పెడుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెరుగుదల : ఇంట్లో మొక్కలు ఉండడం వల్ల రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మొక్కలు పైటో సైడ్లను విడుదల చేస్తాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడడానికి సహాయపడే సహజ రసాయనాలు. అందువల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను తక్కువ.
హాయి నిద్ర : లావెండర్ సహా జాస్మిన్‌తో సహా కొన్ని మొక్కలు మంచి నిద్రకు సహాయపడతాయి. ఇంట్లో, ఇంటి ఆవరణలో వీలైనంత ఎక్కువగా మొక్కలను పెంచుకుంటే మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు.