మా వేదన పట్టించుకోండి సారూ..

– వర్షాన్ని లెక్క చేయకుండా సమ్మెలో పాల్గొన్న గ్రామపంచాయతీ కార్మికులు
నవతెలంగాణ-మొయినాబాద్‌
‘మా ఆవేదన పట్టించుకోండి సారూ’ అంటూ గ్రామ పంచాయతీ కార్మికులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా సమ్మె కొనసాగిస్తున్నారు. మొయినాబాద్‌ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె బుధవారం 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోరు వాన కురుస్తున్నా, గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో పాల్గొంటూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ తమ హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు మున్సిపల్‌ కార్మి కుల మాదిరిగా వేతనాలు పెంచాలని ఈఎస్‌ఐ ,పిఎఫ్‌ కల్పించాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, 51 జీవో రద్దు చేయాలని, మల్టీపర్పస్‌ వర్క్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్‌ మొయినాబాద్‌ మండల అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌, సుధాకర్‌, మాణిక్యం గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు