– భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవు తుంది. పొట్ట, పేగుల్లో విషపదార్థాల్ని తొలగిస్తుంది.
– బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్, పొటాషియం, మినరల్స్, కాపర్, మెగ్నిషియం, ఫైబర్ వంటి పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి.
– డెంగూ ఫీవర్‌తో బాధపడే వారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి పోతుంది. అలాంటి వారు తప్పని సరిగా బొప్పాయి తినాలి. దాంతో ప్లేట్ లెట్స్ మళ్లీ వేగంగా పెరుగుతాయి. వీటి ఆకుల రసం తాగినా చక్కటి ఫలితం ఉంటుంది.
– ఈ పండులో క్యాలరీలు తక్కువే. అందువల్ల ఎక్కువగా తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు. పైగా ఇది చెడు కొవ్వును తరిమేస్తుంది. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది.
– మూత్ర పిండాల్లో రాళ్లు ఉండేవారికి ఇది సరైన మందు. బొప్పాయి రెగ్యులర్‌గా తింటే మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు.
– అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యల్ని బొప్పాయి తొలగిస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి బలం వస్తుంది.
– కాన్సర్పై పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి. ఇందులో బీటాకెరోటిన్, లూటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ వైరస్‌తో పోరాడతాయి. ా
– బొప్పాయి అప్పుడప్పుడూ తింటూ ఉంటే కండ్లకు చాలా మంచిది.
– బీపీ, షుగర్ ఉన్న వాళ్లు కూడా బొప్పాయి తింటే మంచిదే.
– నారింజ, యాపిల్ కంటే బొప్పాయిలో విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మన చర్మం సున్నితంగా, మృదువుగా, కోమలంగా మారడానికి ఉపయోగపడుతుంది.
– బొప్పాయి రుచిగా ఉంటుంది కదా అని మరీ ఎక్కువగా తినకూడదు. మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం.