ఆమనగల్ లో పోలీసుల కవాతు

నవతెలంగాణ- ఆమనగల్:
  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆమనగల్ పట్టణంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన సభ ఎన్నికలను పురస్కరించుకుని ఆమనగల్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ బాల్ రామ్, ఏఎస్ఐ యాదయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.