రాజకీయాలు చర్చించలే…

– శరద్‌ పవార్‌ను కలిసిన అజిత్‌ పవార్‌
ముంబయి: మహారాష్ట్రలోని ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఎన్సీపీ నుంచి తిరుగుబాటు చేసిన అజిత్‌ పవార్‌ సహా పలువురు నేతలు ఈరోజు ముంబయిలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కలిశారు. ఆయన్ను కలిసిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌తో పాటు ప్రఫుల్‌ పటేల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, దిలీప్‌ పాటిల్‌ తదితరులు ఉన్నారు. తిరుగుబాటు చేసిన తర్వాత తొలిసారి వీరంతా ఆయన్ను కలవడం గమనారÛ్హం. ఈ సందర్భంగా ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ.. శరద్‌పవార్‌ ఆశీస్సుల కోసమే వచ్చినట్టు తెలిపారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్‌ను కోరినట్టు పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిపై ఆయనేమీ స్పందించ లేదన్నారు.