చెరువుల సంబురాలు

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు చెరువుల ఉత్సవాలను గ్రామ కమిటీ, గ్రామపంచాయతీ అధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బెస్తవారు వలతో, మహిళలు బతుకమ్మ, బోనాలతో గ్రామంలోని ప్రధాన విదులగుండా శోభాయాత్ర గా చెరువులోకి చేరుకొని బతుకమ్మలను వదిలారు. కట్టమైసమ్మకు బలిదానం చేశారు. అనంతరం గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జెడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు పాల్గొన్నారు. వారితో పాటు స్థానిక సర్పంచ్ అశోక్ కుమార్, ఉపసర్పంచ్ దర్గల వనిత సాయిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్, బిఅర్ఎస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.