– కారెక్కనున్న తెల్లం వెంకటరావుొ అదే దారిలో కోరం కనకయ్య?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్‌ఎస్ పార్టీ భారీ షాక్ ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో 10కి 10 గెలుస్తామంటూ బీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరిన పొంగులేటి ప్రదాన అనుచురుడు తెల్లం వెంకటరావు తిరిగి కారెక్కనున్నారు. భద్రాచలం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి వెంకట్రావు గురువారం ఉదయం గులాబీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది నేతలు కూడా బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల సమక్షంలో ఆయన సొంత గూటికి వస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌తో సమావేశమైన మంత్రి పువ్వాడ అజరు తదితరులు చేరికలపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యతోనూ బీఆర్‌ఎస్ నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఆయన కూడా త్వరలోనే కారెక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది.