ప్రజా గర్జన సభను జయప్రదం చేయాలి

– సాబీర్‌ పాషా
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా గర్జన సభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్‌ సాబీర్‌ పాషా పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో వజ్జ పగడయ్య ఆధ్వర్యంలో సీపీఐ పార్టీ నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీ సీపీఐ అన్నారు. అనంతరం స్థానిక సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కొమరం హనుమంతరావుతో పాటు వివిధ పార్టీల నుండి పలువురు సీపీఐ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైస్‌ ఎంపీపీ రేసు ఎల్లయ్య, కో-ఆప్షన్‌ మెంబర్‌ షేక్‌ రహీమ్‌, షాహిద్‌, తదితరులు పాల్గొన్నారు.