ఆఫీసులు, ఐటీ పార్కుల్లో ప్రీ-స్కూల్‌ అవసరం

– తొమ్మిదో నిజాం రౌనక్‌ యార్‌ఖాన్‌
– హైటెక్స్‌లో యూరోఫియన్‌ సైంటిఫిక్‌ స్కూల్‌ : అపెర్నా వొల్లూరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆఫీసులు, ఐటీపార్కుల్లోనూ ప్రీ-స్కూల్‌ను ఏర్పాటు చేయాలని తొమ్మిదో నిజాం రౌనక్‌యార్‌ఖాన్‌ తెలిపారు. ఐదేండ్ల నుంచి పిల్లలకు రోబోటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌ బోధించే ఏకైక పాఠశాల అని అన్నారు. గచ్చిబౌలిలోని ఈ ప్రీ-స్కూల్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా న్యూరో సైంటిఫిక్‌ స్కూల్‌ సహా వ్యవస్థాపకులు అపెర్నా వొల్లూరు మాట్లాడుతూ ఈ స్కూల్‌నున తెలంగాణకు చెందిన తెలుగు-ఇటాలియన్‌ న్యూరో సైంటిస్ట్‌ స్థాపించారని తెలిపారు. ఆమె ఇటాలియన్‌ని వివాహం చేసుకున్నారని, మూడు దశాబ్దాలుగా ఇటలీలోని బారీలో నివసిస్తున్నారని చెప్పారు. ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న 260 మంది న్యూరో సైంటిస్టుల్లో ఒకరని, ఆ స్పెషలైజేషన్‌లో రెండో వ్యాపారవేత్తని వివరించారు. మై స్కూల్‌ ఇటలీ అనేది ఒక న్యూరోసైంటిఫిక్‌ యూరోపియన్‌ స్కూల్‌, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూరోసైంటిఫిక్‌ ప్రీస్కూల్‌ అని తెలిపారు. జాతీయ విద్యా విధానంతో పూర్తి అనుసంధానంతో పనిచేస్తున్న ఏకైన ప్రీ స్కూల్‌ అని అన్నారు. ఈ పాఠశాలకు భారతదేశంలో 50 శాఖలు ఉన్నాయని, ప్రస్తుతం హైదరాబాద్‌లో 3 శాఖలు ఉన్నాయని తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మరో కేంద్రం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు.