రచ్చ జగన్నాథ్ స్మారక ప్రతిభా పురస్కారాల ప్రదానం

రచ్చ జగన్నాథ్ స్మారక ప్రతిభ పురస్కారం అందుకుంటున్న బాలిక
రచ్చ జగన్నాథ్ స్మారక ప్రతిభ పురస్కారం అందుకుంటున్న బాలిక
నవతెలంగాణ మద్నూర్
రచ్చ జగన్నాథ్ స్మృతి సమితి ఆధ్వర్యంలో  రచ్చ జగన్నాథ్ స్మారక ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి మండల స్థాయిలో మొదటిగా నిలిచిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మద్నూర్ విద్యార్థిని  పాండాల్ వార్ భూమిక ను  గోల్డ్ మెడల్ , ప్రశంసా పత్రం మెమెంటో మరియు నగదు బహుమతి ను  జగన్నాథ్ స్మృతి సమితి వ్యవస్థాపకులు రచ్చ శివకాంత్  ప్రదానం చేశారు.  ఈ సందర్భంగా శివకాంత్ మాట్లాడుతూ ప్రతి ఏటా పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇదేవిధంగా గోల్డ్ మెడల్ తో పాటు నగదు బహుమతి అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ సర్పంచ్ సురేష్, యంపిటిసి కుటుంబ సభ్యులు  బిఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి రచ్చ కుషాల్, ఉప సర్పంచ్ విట్టల్ జిల్లా పరిషత్  బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారుతి, మద్నూర్ సీనియర్ ఉపాధ్యాయులు సునీల్, సి ఆర్ పి రచ్చ అశోక్, హన్మంత రావు, సోమనాథ్  తదితరులు పాల్గొన్నారు.