స్వతంత్ర సమరయోధుల అంశాల పుస్తకం అందజేత

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్ సంకలనం చేసిన ఆజాది అమృత మహోత్సవ చరిత్ర అంశాల పుస్తకాన్ని ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు శాలువా తో సన్మానించి, పుస్తకాన్ని వారి కార్యాలయం లో అందజేశారు. ఈ సందర్భంగా కోటపాటి నరసింహనాయుడు మాట్లాడుతూ స్వాతంత్ర సమయంలో అంశాలు చరిత్రను నేటి విద్యార్థులు చదువుకునే విధంగా తాను స్వయంగా అంశాల సేకరణ సంవత్సరం పాటు రూపొందించిన ఈ పుస్తకాన్ని ,నేటి యువత చదివి దేశ శ్రేయస్సుకు తోడ్పడాలని ఆకాంక్షించారు. ఎందరో దేశ మహాత్ములు చేసిన మనకు తెలియని అంశాలు పొందుపరచడం గొప్పతనం నేటి యువతరానికి ఇతని సేవలు ఆదర్శమని అభినందించారు.