
అవాగాహన తోనే హె.చ్.ఐ.వి ఎయిడ్స్ నివారణ సాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ యం. సుదర్శనం పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం నిజామాబాదు లోని ఉమెన్స్ కళాశాల, కేర్ డిగ్రీ, గిరిరాజ్ కళాశాల, విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించిన జిల్లా స్థాయి 5కే రన్ ను డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సుదర్శనం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఎయిడ్స్ కి నివారణ ఒక్కటే మార్గమని, ప్రజల్లో అవగాహనా కల్పించేందుకే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలలో ఈ 5కే రెడ్ రన్, క్విజ్ పోటీలు, షార్ట్ ఫిల్మ్, స్కిట్ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గురువారం నిర్వహించిన మారథన్ 5కే రన్ లో ముగ్గురు బాలికలు, ముగ్గురు బాలురులను పరుగుపందెం లో ఎంపిక చేయడం జరిగింది. గెలిచిన వారికీ డిి ఎం అండ్ హెచ్ ఓ ట్రాఫిక్ సిఐ రాథోడ్ పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా యూత్ కో ఆర్డినేటర్ శైలి బెల్లా, వైద్యాధికారులు సంతోష్, ప్రవీణ్, డీపీఎం సుధాకర్, జిల్లా టిబి హె.చ్.ఐ.వి కో ఆర్డినేటర్ రవిగౌడ్, ఆరోగ్య విస్తరణాధికారి వెంకటేష్, మధుకర్, స్నేహ సొసైటీ సిద్దయ్య, సూర్య హెల్త్ ఆర్గనైజషన్ రాజేంద్ర, లింక్ వర్కర్ సూపెర్వైసోర్ నారాయణ, మహేందర్, ప్రవీణ్, స్రవంతి,మహేష్ నవీన్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.