జీపీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Problems of GP workers should be resolved immediately– బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు పిప్పళ్ళ వెంకటేష్‌
– 33వ రోజుకు చేరుకున్న జీపీ కార్మికుల నిరవధిక సమ్మె
నవతెలంగాణ-ఆమనగల్‌
గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు పిప్పళ్ళ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలోని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె 33వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య ఆధ్వర్యంలో కడ్తాల్‌ మండల కేంద్రంలో జీపీ కార్మికులు చేపడుతున్న నిరవధిక దీక్షా శిబిరాన్ని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు పిప్పళ్ళ వెంకటేష్‌ సోమవారం యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు ఎర్రోళ్ల రాఘవేందర్‌ తదితరులతో కలిసి సందర్శించి కార్మికులకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. రాత్రి పగలు అనే తేడాలేకుండా గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా 24 గంటలు కష్టపడి పనిచేసే కార్మికులను ప్రభుత్వ వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనం రూ.19,500లకు తగ్గకుండా అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జీపీ కార్మికులు 33 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదష్టమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే బీసీ సంక్షేమ సంఘం వారికి తోడుగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధతం చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింప చేస్తామని ఆయన హెచ్చరించారు. సీఐటీయూ మండల కో కన్వీనర్‌ ఆశిర్వాదం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మల్లయ్య, బీసీ సంఘం నాయకులు లక్ష్మీ నారాయణ, మూడ యాదగిరి, చెనమోని కష్ణ, చెన్న వెంకటేష్‌, క్యామ మహేష్‌, మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల జీపీ కార్మికులు మహేష్‌, తార్య నాయక్‌, సరస్వతి, పద్మమ్మ, లక్ష్మమ్మ, అంజమ్మ, కలమ్మ, యాదమ్మ, రాములమ్మ, శివ, నీల, దీపిక, పాపయ్య, అంజమ్మ, మంజుల, జ్యోతి, చిట్టెమ్మ, చెన్నయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.