ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తేనే ప్రగతి

– విద్య ప్రయివేటీకరణతో పెరుగుతున్న అంతరాలు
– సర్కారు విద్యాసంస్థల్లో ఖాళీలు భర్తీ చేయాలి
      ప్ర‌జాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తేనే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకెళ్తుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అలవర్చుకోవాల్సిన అవసరముందని చెప్పారు. మానవాభివృద్ధి సూచికలో ఏ రాష్ట్రం ముందంజలో ఉంటే అది అభివృద్ధిలోనూ ముందుంటుందని వివరించారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కొందరికే అందించడం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వరంగం బలోపేతం అయితేనే అందరికీ నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు…
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై ఏమంటారు? ప్రజల ఆకాంక్షలు నెరవేరాయంటారా?
తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా?అన్నది బీఆర్‌ఎస్‌ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంపై ఆధారపడి ఉన్నది. వాటిని గమనిస్తే పాక్షికంగానే నెరవేర్చింది. సాగునీరు, విద్యుత్‌, చెరువుల పునరుద్ధరణ, హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పన, హరితహారం, సంక్షేమ కార్యక్రమాల అమలు, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చింది. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి దళితబంధు పేరుతో రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నది. ఇది ప్రారంభదశలోనే ఉన్నది. పూర్తిగా విజయవంతమైందని చెప్పలేం. అందరికీ ఒకే రకమైన విద్య అని 2014లో ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కానీ విద్యారంగం ఇంకొంత ప్రయివేటురంగంలోకి వెళ్లిపోయింది.
అనేక రంగాల్లో అభివృద్ధితో దేశానికే ఆదర్శమంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది కదా. మీరేమంటారు?
దేశమంటే మట్టికాదోయే దేశమంటే మనుషులోరు అన్నారు గురజాడ. మానవాభివృద్ధి సూచికలో ప్రథమ స్థానంలో ఉంటే ఆ రాష్ట్ర అభివృద్ధిలో కూడా ప్రథమ స్థానంలో ఉంటుంది. దీనికి విద్యావైద్యం, ఉపాధి, తలసరి ఆదాయం పంపిణీ కీలకం. ఈ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం కృషి నామమాత్రంగానే ఉంది. జీఎస్‌డీపీలోగాని తలసరి ఆదాయంలోగాని ఉన్నత స్థితిలో ఉండొచ్చు. ఒకరికి రూ.కోటి ఆదాయం, మరొకరికి రూ.రెండు లక్షల ఆదాయం ఉంటుంది. ఇద్దరి తలసరి ఆదాయం రూ.51 లక్షలవుతుంది. కానీ రూ.రెండు లక్షల ఆదాయం ఉన్న కుటుంబం రూ.51 లక్షలకు ఎప్పుడు చేరుకుంటుంది. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి.
సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం, గురుకులాలను పెద్దఎత్తున
ప్రవేశపెట్టామని ప్రభుత్వం చెప్పడంపై మీ అభిప్రాయమేంటీ?
దేశంలోనే అత్యధిక గురుకులాలున్న రాష్ట్రం తెలంగాణ అన్నది యదార్థం. 60 లక్షల మంది విద్యార్థులున్న ఈ రాష్ట్రంలో గురుకులాల్లో చదువుకు నేది ఐదు లక్షల మంది మాత్రమే. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌ పాఠశాలలతోపాటు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలు సర్కారు ఆధీనంలో ఉన్నాయి. ఈ స్కూళ్ల అభివృద్ధి కోసం 2021, డిసెం బర్‌ వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభు త్వం చేపట్టలేదు. 2022, జనవరిలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని 9,123 స్కూళ్లలో రూ. 3,497 కోట్లతో మొదటి విడత చేపట్టింది. నిర్దిష్ట మైన బడ్జెట్‌ కేటాయింపుల్లేక నేటికీ మూడో వంతు బడుల్లో కూడా పనులు పూర్తి కాలేదు. ఏ బడులకైతే తక్కువ పనులు, రంగులు, డ్యూయెల్‌ డెస్క్‌లు, గ్రీన్‌ బోర్డులు ఏర్పాటు చేసే 1,500 బడుల్లో పనులు పూర్తయినట్టు కనిపిస్తున్నది. ఎక్కువ అవసరాలున్న పాఠశాలల్లో పనులు పూర్తి కాలేదు. బడికి టీచర్‌ కీలకం. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫిికే షన్లు వస్తున్నాయి కానీ ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ కావడం లేదు. ఈ విద్యా సంవత్స రమైనా ప్రతి బడికి పారిశుధ్యం, ఇతర పనుల కోసం సర్వీసు పర్సన్లను నియమించాలి. కాంట్రాక్టు అధ్యాప కుల క్రమబద్ధీకరణ అభినందనీయం. జూన్‌ ఒకటో తేదీ నుంచి గెస్ట్‌ లెక్చరర్లను నియ మించాలి. విశ్వ వి ద్యాలయాల్లో ఖాళీ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాలి. వర్సిటీ కాంట్రాక్టు అధ్యా పకులను క్రమ బద్ధీకరించాలి. నిర్వహణ గ్రాంటును పెంచాలి.
కొన్ని రాష్ట్రాలు, ప్రయివేటు విద్యాసంస్థల్లో డిజిటల్‌ విద్య అమలవుతున్నది. దీనిపై ఏమంటారు?
రాష్ట్రంలో పాఠశాల విద్య మొదలుకుని ఉన్నత విద్య వరకు అంతరాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే విద్యలో అంతరాలను తొలగించే అవకాశముం టుంది. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 20 శాతం, కొఠారి కమిషన్‌ సిఫార సుల ప్రకారం కేంద్ర బడ్జె ట్‌లో పది శాతం నిధులు కేటాయించాలి. అప్పుడు అంతరా ల్లేని విద్య అందించొచ్చు.ప్రయివేటు విద్య లోనూ చాలా అంతరాలు కనిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నది.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మీ సందేశమేంటీ?
నేను ఒక టీచర్‌ను. ప్రజాస్వామ్యమంటే ‘ప్రజల చేత, ప్రజల కొర కు, ప్రజలే పరిపాలించు కునేది’ అనే వాక్యాన్ని పదే పదే భావిభారత పౌరుల కు చెప్పాను. చట్టసభల్లో సభ్యున్ని అయ్యాక ఆ నిర్వ చనం తలకిందులు అయి నట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సవరించుకోవాలి. ప్రజాస్వామ్యంలో సాధ్యమైనంత మేరకు ప్రజల అభిప్రాయాలకు పెద్దపీట వేయాలి. అప్పుడే ప్రగతి సాధ్యం. ప్రజల అభిప్రాయాలను వ్యక్తీకరించేది వివిధ ప్రజా సంఘా లు, సమూహాలు, రాజకీయ పార్టీలు. ఈ సమూ హాలతో అవసర మైన సందర్భాల్లో చర్చించే ఆన వాయితీ రాష్ట్ర ప్రభుత్వం అలవర్చుకోవాలి.