అభ్యుదయవాది కామ్రేడ్‌ రాకేష్‌ మాస్టర్‌

నేడు సంస్మరణ సభ
నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడు గ్రామంలో దక్షిణ భారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య గారి సహచరుడు కామ్రేడ్‌ సీనూరి బాల్‌రెడ్డి. సుందరయ్య ప్రస్థానం నుంచి కామ్రేడ్‌ సీనూరి బాల్‌రెడ్డి కూడా పేద ప్రజల పోరాటాలలో ప్రజలకు సహాయం చేసే దాంట్లో తన వంతు కృషిగా పనిచేసేవారు. అనేకసా ర్లు బాల్‌రెడ్డిపైన గ్రామంలో అనేక సార్లు దాడులు జరిగాయి. దాంతో పార్టీ నాయకులు ఆలోచన చేసి తిరుపతికి వెళ్లి పార్టీ నిర్మాణంలో పని చేయాలని ఆదేశించి పంపించారు. శంకరమ్మతో సీనురు బా ల్‌రెడ్డి పార్టీ పెద్దలు ఆదర్శ వివాహం జరిపించారు. వీరికి నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు జన్మించారు.
1968లలో పుట్టిన రెండవ కుమారుడు (రాకేష్‌ మాస్టర్‌) రామారావుగా నామకరణం చేశారు. చిన్ననా టి నుండి ముక్కుటి సూటితనం, మొండి దైర్యం కలిగిన వ్యక్తి ఒకే మాట మీద నిలబడి ఉండేవాడు పెద్దగా చదువుకోలేదు. నీ కొడుకు ఖాళీగా తిరుగు తూ డాన్సులు చేస్తున్నాడని తండ్రితో చెప్పేవారు అది విని కోపంతో ఇంటికి వచ్చిన తండ్రి గారు కట్టెలు ఇరిగే వరకు కొట్టేవారట అయినా నేను డాన్సర్‌ అవుతాను అని చెప్పేవారంటా తండ్రి బలవంతంగా దగ్గర ఉండి బడికి తీసుకెళ్ళి వదిలేవారు. కానీ చదువు తనకు అబ్బలేదు. పెండ్లిలలో, ఫంక్షన్ల దగ్గర డప్పు ల చప్పుడు వినిపిస్తే చాలు అక్కడకు వెళ్లి ప్రత్యక్షమ య్యేవాడు. ఒక రోజు తల్లిదండ్రులు రామారావు చేస్తున్న డాన్స్‌ ప్రోగ్రాంను చూసి నివ్వెరపోయి నారు. ఒరేరు నాన్న నువ్వు ఎలాగైనా సినిమాలలో హీరో కావాలని తన తండ్రి అన్నాడట. లేదు నేను డ్యాన్సర్‌ అవుతానని రాకేష్‌ మాస్టర్‌ అనేవాడట. సినిమాలలో అవకాశం కోసం 18 సంవత్సరాల వయస్సు లో తిరుపతి నుండి మద్రాసు వెళ్లాడు. ప్రముఖ నాట్య కళాకారులు శర్మ గారి దగ్గర భరతనాట్యం, కథాకళి, కూచిపూడి, సాగర్‌ సంగమం లాంటి నృత్యాలు నేర్చుకున్నాడు. ఆయనకు కరాటే మాస్టర్‌ బ్రూస్‌ లీ అంటే చాలా ఇష్టం. చిన్నతనం లోనే కరాటే, బాడీ బిల్డర్‌, జిమ్నాస్టిక్‌, నేర్చుకున్న ఆజానుబాహుడు. 1993 సంవత్సరంలో చిన్న డ్యాన్స్‌ ఇన్స్టిట్యూట్‌ పెట్టి చాలామందికి క్లాసులు నేర్పించాడు. తిరుపతిలో ఉన్న ధనవంతుల పిల్లలు అక్కడకు వచ్చి డాన్స్‌ నేర్చుకునేవారు. మూడు నెలల్లో రామారావు డ్యాన్స్‌ స్కూల్‌ అని ఎంతో పేరు సాధించాడు. ఈ క్రమంలో డైరెక్టర్‌ శేఖర్‌ వర్మ ‘నీవు ఇప్పటికి చాలాసార్లు వచ్చావు సినిమా అంటే చాలా పిచ్చి ఉన్న వ్యక్తి లాగా ఉన్నావు ఈ కార్డు తీసుకొని వెళ్లి హైదరాబాద్‌లో ముక్కు రాజు మాస్టర్‌ని కలవు’ అని చెప్పారు. దాంతో ముక్కు రాజు, సలీం మాస్టర్‌కు ఫోన్‌ చేయడంతో తనను తిరుపతి నుండి రప్పిం చారు. ముక్కు రాజు మాస్టర్‌ గారి 12 మంది శిష్యుల లో సాష్టాంగ నమస్కారం కదలికలు భరతనాట్యం డిస్కో డాన్స్‌ ఇలాంటివి చేసి చూపించారు. రాజుకి ప్రియ శిష్యుడుగా చేరిపోయాడు.
హీరో ప్రభాస్‌, హిరోయిన్‌ ప్రత్యూష, హీరో వే ణు, యాంకర్‌ ఉదయభాను, బ్రహ్మ నందం గారి కోడుకు, దాసరి నారాయణ రావు కోడుకు, లాంటి పలువురు ఆయన దగ్గర ఇన్స్టిట్యూట్‌లో డ్యాన్స్‌ నేర్చు కున్న వారే. తన పేరును రామారావు నుంచి రాకేష్‌ మాస్టర్‌గా మార్చుకున్నాడు. తర్వాత శేఖర్‌ మాస్టర్‌ తన ప్రియ శిష్యుడుగా చేరాడు. దీంతో హీరో వేణు దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం, చిరునవ్వు లాంటి సినిమాలలో డాన్సర్‌ కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు కల్పించారు. 1998 లోమంచి తరుణంలో బడ్జెట్‌ పద్మనాభం సినిమాకు కొరియోగ్రఫీ చేశారు. ఏడాదికి 30 నుంచి 40 సినిమాలలో పనిచేసేవారు. తెలుగు సినిమా ఇండిస్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. బోరబండలోని వడ్డేర కులానికి చెందిన బోదాసు జంగయ్య కూతురు లక్ష్మీని ఆదర్శ వివాహం చేసుకున్నారు వారికి కుమారుడు చరణ్‌ తేజ, కూతురు రిష్క సంతానంగా ఉన్నా రు. భార్య లక్ష్మి ఎల్‌వి ప్రసాద్‌ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్నారు.
అవార్డులు :
రాకేష్‌ మాస్టర్‌ నృత్య కళా ప్రదర్శనలు చూసి పాండిచ్చేరి రాష్ట్రం ప్రభుత్వం నాట్య రత్న అవార్డు ప్రదానం చేశారు. 2020 సంవత్సరంలో అమెరికా గ్లోబల్‌య్యూమనసిస్ట్‌ యూనివర్సిటీ వారు డాక్టర్‌ రేట్‌ ప్రదానం చేశారు ఈటీవీ డాన్స్‌- డి-లాంటి బుల్లితెరలతో పాటు జబర్దస్త్‌ ప్రోగ్రాంలో బషీర్‌ అనే కుర్రవాడికి మాస్టర్‌గా చేశారు.
టాలీవుడ్‌ ఇండిస్టీలో బిజీయేస్ట్‌ మాస్టర్‌గా పేరుపొంది అమెరికా,స్వీజర్‌ ల్యాండ్‌, ఇటలీ. జర్మనీ, బ్రిటన్‌, థాయిలాండ్‌. నేపాల్‌ లాంటి అనేక దేశాల్లో తన ప్రొగ్రాంలు, షూటింగ్‌లు చేశాడు. సుమారు 60 మంది హీరోలు, హీరోయిన్లతో స్టెప్పులు వేయించిన భారత దేశం గర్వించదగ్గ డ్యాన్స్‌ మాస్టర్లలో గొప్ప బీట్‌ డ్యాన్స్‌ మాస్టర్‌గా పేరు గాడించారు. 1600 సినిమాలకు పైగా కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
సేవా కార్యక్రమాలు..
కరోనా సమయంలో రూ.70 లక్షలతో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మేట్‌లో తన ప్రాణ మిత్రుడు అలేటి అటం ఆశ్రమంలో ఉంటూ అందులో ఉండే రోగు లు, వృద్ధుల కోసం సేవా కార్యక్రాలు చేశాడు. రం గారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మేట్‌ సీపీఐ(ఎం) శాఖ లో సభ్యుడు, ప్రజాసంఘాలలో పనిచేసే వాడు. ఇం డ్రస్టీలోని కార్మికుల కోసం రాకేష్‌ మాస్టర్‌ అనేక పోరాటాలు చేశాడు. ఎంతో మంది మాస్టర్లకు జీవితాన్ని ఇచ్చాడు.
‘యువత మేలుకో-సమాజాన్ని ఏలుకో’ అని ప్రతి సందర్భంలో తన నోటి నుంచి వచ్చే మాటలు. ప్రజలపై ప్రభుత్వాలు చేస్తున్న దాడులను, అధిక ధరల పెరుగుదలపై రైతులు కార్మిక వర్గం ఎదు ర్కొంటున్న సమస్యలు, ఉద్యమాలు, సీఐటీయూ కార్యక్రమాలలో పాల్గొనేవాడు. తనదైన శైలిలో తన మాట చాతుర్యాన్ని, అహంభావాన్ని ప్రజలను నిత్యం చైతన్యం చేయడంలో ధైర్యంగా తన నాట్య కళారూపాలను తన వేస్ట్రన్‌ డాన్స్‌లు, ఫోక్‌ డ్యాన్సులు , యూరోపియన్‌ డ్యాన్సలు భరతనాట్యం కూచిపూడి కథక్‌, కథాకళి నృత్య శైలిని ప్రదర్శించేవాడు. పెట్టుబడిదారి సమాజం లో తనను సరుకుగా ఉపయోగించుకున్నారు. ప్రజల సాధకాబాధకాలు పట్టని ప్రభుత్వాలపై నిప్పులు చేరిగేవాడు. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌)లో పని చేశారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సీపీఐ(ఎం) పక్షాన ప్రచార కార్యక్రమలలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా పోరుగడ్డ ఇబ్రహంపట్నంలో ప్రజానాట్యమండలి కళాకారుల సప్డర్‌ హష్మి ఓపెన్‌ థియేటర్‌ (షాట్‌)లో జనాన్ని ఒక ఊపు ఊపినాడు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జరిగిన ఉద్యమాల్లో రాకేష్‌ మాస్టర్‌ పాల్గొ న్నారు. ఆలేటిఆటంతో పాటు నిత్యం సమాజ పరిణా మ క్రమం, రాజకీయ అర్థశాస్త్రం, గతితార్కిక భౌతిక వాదం, స్వాతంత్య్ర సంగ్రామం, పార్టీ ప్రజాసం ఘాలు, రంగనాయకమ్మ రచనలు, ప్రపంచ విప్లవా లు, ప్రజాసాంస్క్రతిక కళలపై దాడులు దౌర్జన్యాలు, పార్టీ క్రమశిక్షణ కర్తవ్యాలు లాంటి తదితర అంశాలు విని చర్చించేవాడు. ప్రసంగించేవాడు.
నేడు విస్తరిస్తున్న నయా ఉదారవాద విధానా లతో అల్లాడిపోతున్న ప్రజానీకం సమ సమాజం వైపు నడవాలని తన చిరకాల ఆంక్ష. అది నెరవేరడం కోసం ప్రజాస్వామ్య, అభ్యుదయ వాదులందరూ సీపీఐ(ఎం) పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ తన ఆశయాలకు కార్యరూపం దాల్చి ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోయేటందుకు కృషి చేయాలి.
అబ్దుల్లాపూర్‌మేట్‌లోని ఆయన ఇళ్లును సినిమా ఇండిస్టీ, టివి కార్మికుల కోసం కామ్రేడ్‌ డాక్టర్‌ రాకేష్‌ మాస్టర్‌ కళానిలయంంగా మార్చాలని, ఆయన చిరకాల స్వప్నం నెరవెరలాని కోరుకుంటూ రాకేష్‌ మాస్టర్‌కు మనస్సుమాంజాలి. విప్లవ జోహార్లు…