13మంది తహశీల్దార్లకు పదోన్నతి

– ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో అధికారుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. 13 మంది తహశీల్దార్లు, సచివాలయంలోని సెక్షన్‌ ఆఫీసర్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రమోషన్‌ పొందినవారిలో కె.మహేశ్వర్‌, ఎం.సూర్యప్రకాష్‌, మురళీకృష్ణ, కె.మాధవి, పి.నాగరాజు, ఎల్‌.అలివేలు, బి.శకుంతల, కె.సత్యపాల్‌రెడ్డి, పి.మాధవిదేవి, వి.సుహాసిని, భూక్య బన్సీలాల్‌, బి.జయశ్రీ, ఎం.శ్రీనివాస్‌రావు, డి.దేవుజా, డి.ప్రేమ్‌రాజ్‌, ఐవీ.భాస్కర్‌కుమార్‌, ఉప్పల లావణ్య, డి.చంద్రకళ, ఆర్‌వీ.రాధాబాయి ఉన్నారు.