బీటీ రోడ్డు నిర్మించాలని నిరసన

పాదయాత్రలో తల్లోజు ఆచారి
నవతెలంగాణ-తలకొండపల్లి
బీటీ రోడ్డు వేయడానికి నిధులు మంజూరైనా మం డల పరిధిలోని రోడ్డు వేయకపోవడంతో బీజేపీ నాయకు లు పట్ల నిరసన వ్యక్తం చేశారు. వెంకటాపూర్‌ తండా నుండి పడకల్‌ గ్రామం వరకు బీటీ రోడ్డు కోసం మూడు రోజులుగా బీజేపీ నాయకులు నిరసన చేస్తున్నారు. బీజేపీ జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పాదయాత్ర చేపట్టి నిరసన చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ రోడ్డు నిర్మాణం తన వల్ల కాదంటే 24 గంటల్లోనే బీటీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభిస్తారని జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కండే హరి ప్రసాద్‌, బీజేపీ మండల అధ్యక్షుడు రవి గౌడ్‌, జిల్లా కార్య దర్శి పాండు, ఉపసర్పం చి బీజేఎం తాలూకా ఇన్‌చార్జి ప ద్మ అనిల్‌, శేఖర్‌ రెడ్డి, గెల్వలయ్య, శ్రీకాంత్‌, హరికాంత్‌, సుదర్శన్‌, శ్రీశైలం, కష్ణ వెంకటేష్‌, నరసింహ తదితరులు పాల్గొన్నారు.