– బీఆర్‌ఎస్‌ది వెలుగుల పాలన
– కాంగ్రెస్‌ది విధ్వంస ఆలోచన
– ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-నవాబుపేట్
రైతన్నలకు 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు అంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండలం మినాపల్లి కలాన్ క్లస్టర్‌లో నిర్వహించిన రైతుల సమా వేశానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..స్వయంపాలనలో సీఎం కేసీ ఆర్ నాయకత్వంలో 24 గంటల నాణ్యమైన విద్యు త్తులో రాష్ట్రం దేదీప్యమానంగా వెలుగొందు తుం టే… పరాయి పాలకులు, కిరాయి నేతల కళ్లు మండు తున్నాయన్నారు. ఈ వెలుగులను ఆర్పాలని, రైతుల ను చీకట్లో పాము కాటుకు, కరెంటు షాక్‌కు బలి చేయాలని, తెలంగాణ వ్యవసా యాన్ని తేరుకో కుండా చేయాలని అధికారం హస్త గతం చేసుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు బట్టబయలు అయ్యాయని అన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్ సభలో రాహుల్ గాంధీ వెల్లడించిన ప్రకటనలో ఎక్కడా ఉచి త విద్యుత్ ఊసే లేదని మసిబూసి మారెడు కాయ చేసే వాగ్దానాలతో రైతులను ఈజీగా మోసం చేయ వచ్చని రైతు విద్రోహ కుట్రకు కాంగ్రెస్ నాయకులు తెరలేపా రన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతు లు మూడు పంటలతో ముచ్చటగా మురిసిపోయే టట్లు చేస్తు న్నారన్నారు. కర్షకుల సంతోషంపై కంట గింపు తెచ్చుకున్న కాంగ్రెస్ మూడు పంటలు వద్దు… వ్యవ సాయానికి మూడు గంటల కరెంటు చాలు అం టూ అన్నదాతల వెన్ను విరిచే కాంగ్రెస్ వికృత విధా నం విస్పష్టమైదన్నారు. కార్యక్రమంలో సీఎపీఎస్‌సీ చైర్మన్ పోలీస్ రామ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, పాపిరెడ్డి, సర్పంచులు మాణిక్ రెడ్డి, రత్నం, అంజయ్య, నివాస్, స్వరూప భీమయ్య, రైతులు రైతు ల సంఘాల నాయకులు, ప్రకాశం, అంజయ్య, విట్టల్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి, వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.