వడదెబ్బ తగలకుండా ట్రాఫిక్ పోలీసులకు హోమియోపతి మెడిసిన్స్ అందజేత 

నవతెలంగాణ – కంటేశ్వర్
ట్రాఫిక్ సిబ్బందికి జేమ్స్ రోటరీ క్లబ్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో వడదెబ్బ తగలకుండా నివారణ నిమిత్తం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హోమియోపతి మెడిసిన్స్ ను అడిషనల్ డీసీపీ అడ్మిన్ చేతుల మీదుగా ట్రాఫిక్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కోటేశ్వర రావు, ట్రాఫిక్ ఏసీపీ  నారాయణ, వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ  విజయ్ బాబు, ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ వెంకట నారాయణ, రోటరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ దేవిదాస్, జాయింట్ సెక్రెటరీ  చంద్రశేఖర్, హోమియోపతి డాక్టర్  గోపికృష్ణ   ట్రాఫిక్ సిబ్బంది హాజరు కావడం జరిగింది.