ప్రభుత్వ విద్యను

– రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది
– విద్యాసంస్థల ఆధునీకరణకు నిధులు కేటాయించాలి : ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
 –  కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్టలక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ, గురుకులాల హాస్టల్స్‌ సమస్యలకు నిలయంగా ఉన్నాయని మారాయని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్టలక్ష్మన్‌ తెలిపారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ విద్యాసంస్థల భవనాల ఆధునీకరణకు ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని, వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల వరదల వల్ల రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్‌ చెరువులను, కుంటలను తలపించే విధంగా వరద నీరు చేరిందని తెలిపారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, లెక్చరర్‌, నాన్‌ టీచింగ్‌, వార్డెన్‌, ఇతర పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.