ప్రజల చెంతకే ప్రభుత్వ వైద్యం

– ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
– ఐదు 108 అంబులెన్స్‌లు ప్రారంభం
– త్వరలోనే ప్రారంభించనున్న డయాలసిస్‌ సెంటర్‌ పరిశీలన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేసీఆర్‌ నాయకత్వంలోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల చెంతకే ప్రభుత్వ వైద్యాన్ని తీసుకువస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు 108 అంబులెన్స్‌లను ఆయన ప్రారంభించారు. త్వరలో ప్రారంభించనున్న డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మరింత సేవలందించేందుకు 108 వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. డయాలసిస్‌తో బాధ పడుతున్న పేదలకు సైతం ఖర్చు లేకుండా వైద్యం అందించాలన్న లక్ష్యంతో 40పడకలతో కూడిన కేంద్రాన్ని ప్రారంభించనున్నామన్నారు. కార్యరకమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కప్పరి స్రవంతి, ఎంపీపీ కృపేష్‌, వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి, పలువురు కౌన్సిలర్లు తదితరులున్నారు.